సౌదీ:ప్రవాస కార్మీకుల ఫీజు చెల్లించాలనే నిర్ణయంతో 8,967 ఫ్యాక్టరీలకు లబ్ధి

- November 08, 2020 , by Maagulf
సౌదీ:ప్రవాస కార్మీకుల ఫీజు చెల్లించాలనే నిర్ణయంతో 8,967 ఫ్యాక్టరీలకు లబ్ధి

సౌదీ:విదేశీ కార్మికుల ఫీజు చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 8,967 ఫ్యాక్టరీలు నేరుగా లబ్ధి పొందాయని పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే కింగ్డమ్ పరిధిలోని 95 శాతం ఫ్యాక్టరీలు, కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రయోజనం చేకూరిందని తెలిపింది. అయితే..సర్వీసులు రద్దు చేయబడిన, లైసెన్స్ గడువు ముగిసిన ఫ్యాక్టరీలు మాత్రం విదేశీ కార్మికుల ఫీజు చెల్లింపుల నుంచి లబ్ధి పొందలేకపోయాయని మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రొత్సాహక విధానం ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టార్ కు దోహదం చేస్తుందని, సౌదైజేషన్ కు బలాన్ని చేకూర్చుతుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 836 కొత్త పరిశ్రమలకు లైసెన్స్ జారీ చేశామని, గత ఏడాదితో పోలిస్తే..95 శాతం ఎక్కువని వివరించారు. లైసెన్స్ ఫ్యాక్టరీల పెట్టుబడుల్లో 116 శాతం
వృద్ధి కనిపించిందన్నారు. మరోవైపు కరోనా సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగం వేగంగా తేరుకుంటోందని కూడా పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా ఒడిదుడుకులతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్న కంపెనీలు, ఫ్యాక్టరీలు గత మూడు నెలల కాలంలో మళ్లీ పూర్తి స్థాయిలో ఉద్యోగులను భర్తీ చేశాయని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com