కువైట్:మాజీ ఎంపీ కుమారులపై మనీ లాండరింగ్ ఆరోపణలు

- November 08, 2020 , by Maagulf
కువైట్:మాజీ ఎంపీ కుమారులపై మనీ లాండరింగ్ ఆరోపణలు

కువైట్ సిటీ:కువైట్ లోని ఓ మాజీ ఎంపీ కుటుంబం చుట్టు ఆర్ధిక అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టాయి. ఎంపీ ముగ్గురు కుమారుల బ్యాంక్ లావాదేవీలు అనుమానస్పదంగా ఉన్నాయని స్థానిక బ్యాంకు అధికారులు ఆర్ధిక నిఘా విభాగానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురు బ్యాంక్ అకౌంట్ల నుంచి విదేశీ బ్యాంక్ అకౌంట్లోకి 1.7 మిలియన్ కువైట్ దినార్లు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఎంపీ కుమారులకు చెందిన మూడు అకౌంట్లోకి నిధులు జమ అయ్యాయని, ఆ తర్వాత..ఆ సొమ్ము స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న ఓ యూరోపియన్ కంపెనీకి బదిలీ అయినట్లు తెలిపారు. అయితే..ఆ స్విస్ బ్యాంక్ ఖాతా మాజీ ఎంపీదే అయి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com