ఒమన్ నుంచి విమానాలను రద్దు చేసిన ఇండియన్ ప్రైవేట్ ఎయిర్ లైన్స్
- November 08, 2020
మస్కట్:విమాన సర్వీసులకు సంబంధించి భారత్-ఒమన్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని సవరించటంతో ఇండియన్ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఒమన్ నుంచి భారత్ కు సర్వీసులు నడిపించిన గోఎయిర్, ఇండిగో ఎయిర్ లైన్స్ ఇక తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు తాము ఈ డిసిషన్ తీసుకున్నట్లు వెల్లడించాయి. అయితే..ఆదివారం రోజున మాత్రం షెడ్యూల్ ప్రకారమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఒమన్ నుంచి భారత్ వెళ్లాలనుకునే ప్రయాణికులు..తమ ప్రయాణ తేదిని నవంబర్ 7, 8 తేదిలకు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, ప్రయాణ తేదీలను ఆయా తేదీలకు ప్రీపోన్ చేసుకునేందుకు వీలుగా ఎలాంటి రీషెడ్యూల్ చార్జీలు వసూలు చేయబోమని కూడా ఇండిగో వెల్లడించింది. అయితే..సీట్ల లభ్యతను బట్టి ముందుగా వచ్చిన వారికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ఒకవేళ నవంబర్ 7, 8 తేదీల్లో ప్రయాణానికి సంబంధించి టికెట్లు రీషెడ్యూల్ చేయలేకపోతే వారికి ఛార్జీ డబ్బులను మొత్తం తిరిగి చెల్లించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. మరోవైపు గోఎయిర్ కూడా సీట్ల లభ్యతను బట్టి ప్రయాణికులు 7, 8 తేదిన టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు