'ప్రేమసాగరం 1995' ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరి!!
- November 08, 2020హైదరాబాద్:సాయిశ్వర్, ప్రియాంక రేవరి జంటగా సాయి వైష్ణవి పిక్చర్స్ పతాకంపై వి యస్ ఫణి0ద్ర దర్శకత్వంలో గోపాల్ నాయుడు నిర్మిస్తున్న చిత్రం "ప్రేమసాగరం 1995". కంప్లీట్ లవ్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కాగా ఈ చిత్రం టైటిల్, మోషన్ పోస్టర్ ని హీరో సాయిశ్వర్ పుట్టిన రోజు సందర్బంగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేశారు. సుమన్, రాజా రవీంద్ర, రమ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
నిర్మాత గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. మా దర్శకుడు ఫణిoద్ర చెప్పిన కథ నచ్చి ఎంతో ఇంప్రెస్ అయి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రేమకథలతో వచ్చే ప్రతి సినిమా యువతీ యువకులను ఆకట్టుకుంటుంది.. కానీ అందులో నాచులర్ గా రియలస్టిక్ గా కొత్తదనంతో ఉండాలి అప్పుడే ఆ కథ ప్రేక్షకులను రక్తికట్టిస్తుంది. అలాంటి కథే మా ప్రేమసాగరం. ఈ సినిమా తర్వాత మరిన్ని ప్రేమకథలు రావడానికి ఇన్స్పిరేషన్ గా మా ఫిల్మ్ నిలుస్తుంది. మాకు ఎంతో అండగా నిలుస్తూ సపోర్ట్ చేస్తున్న రాజ్ కందుకూరి గారికి నా థాంక్స్..ఈ నెలలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం.. అన్నారు.
దర్శకుడు ఫణిoద్ర మాట్లాడుతూ.. మా చిత్రం టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కి రెడి అవుతున్నాం.. అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్:
జానకిరామ్, కెమెరా: మణికంఠ, మ్యూజిక్: హర్ష ప్రవీణ్, డ్రోన్, జాన్ భాష: లిరిక్స్: శ్రీరామ్, తపస్వి, అంజన్, ఫైట్స్: పృద్వి,
డాన్స్: కపిల్, పిఆర్ఓ: సాయి సతీష్, నిర్మాత: గోపాల్
నాయుడు, రచన-దర్శకత్వం:వి యస్ ఫణి0ద్ర.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!