చైనా నుంచి టెహ్రాన్ చేరుకున్న తొలి 'సిల్క్ రోడ్' ట్రైన్
- February 15, 2016
చైనా, ఇరాన్‌లను కలిపే ట్రైన్ తొలిసారిగా టెహ్రాన్ చేరుకుంది. చైనా నుంచి పెద్ద మొత్తంలో గూడ్స్ ఈ ట్రైన్ ద్వారా చేరుకుంటున్నట్లు ఇరానియన్ రైల్వే కంపెనీ వెల్లడించింది. 32 కంటెయినర్లలో కమర్షియల్ ప్రోడక్ట్స్ తూర్పు జెజాంగ్ ప్రావిన్స్ నుంచి 9,500 కిలోమీటర్ల దూరం 15 రోజుల్లో చేరుకుంది. కజకిస్తాన్, తుర్కెమినిస్తాన్ మీదుగా ఈ రైలు ప్రయాణించింది. సిల్క్ రోడ్, మార్గమధ్యంలో వున్న దేశాలకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు వెల్లడించారు. సముద్రయానంతో పోల్చితే 30 రోజుల సమయం ఆదా అవుతుంది. టెహ్రాన్‌తో ఈ రైల్వే ప్రాజెక్ట్ ఆగిపోదనీ, దీన్ని యూరోప్‌కి కూడా విస్తరించే ఆలోచనలున్నాయని అధికారులు వెల్లడించారు. అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువగా ట్రైన్ ట్రిప్‌లను పెంచుతామని కూడా అధికారులు చెబుతున్నారు. చారిత్రాత్మకమైన, అతి పురాతనమైన వ్యాపార సంబంధాలను పునరుద్ధరించడంలో భాగంగా చైనా మరియు మెడిటేరియన్ సీ కనెక్టింగ్ కోసం రూపొందించిన ఈ రైలుకు చైనా సిల్క్ ట్రేడ్‌ని ప్రతిబింబించేలా 'సిల్క్ రోడ్'గా నామకరణం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







