ప్రతి సంవత్సరం RO ప్లాంట్ దానం చేస్తున్న ఎన్.ఆర్.ఐ

- November 08, 2020 , by Maagulf
ప్రతి సంవత్సరం RO ప్లాంట్ దానం చేస్తున్న ఎన్.ఆర్.ఐ

ఒమన్:ఆంధ్రప్రదేశ్, అమరావతి, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సుమారు 7 మండలాలు ,కవిటి ,సోంపేట ,కంచిలి ,ఇచ్చాపురం ,పలాస ,టెక్కలి ,వజ్రపు కొత్తూరు ఈ మండలాలు గత 20 సంవత్సరాలు నుంచి అనేక మంది యూక్త వయస్సు వారు కిడ్నీ వ్యాధి కి గురి అవుతున్నారు ఇండియా ప్రభుత్వం అనేకమార్లు ఉద్దానం ప్రాంతం లో  పరిశోధనలు నిర్వహించారు  అలాగే అమరిక లండన్ వంటి దేశాలనుంచి వచ్చి మరి కిడ్నీ వ్యాధి కి గల కారణాల పై పరిశోధనలు జరిపారు కానీ వ్యాధికి కి గల కారణాలు తెలియడం లేదు ప్రపంచ లో  అతి ఎక్కువ కిడ్నీ వ్యాధి గ్రస్తులున్న దేశంగా శ్రీలంక ఐతే  రెండు వ స్తానం ఇండియా లో ఉద్దానం ప్రాంతం  ది కావడం గమనార్థం ఉద్దాన ప్రాంత కొబ్బరి జిమిడి  పచ్చని వారి పంటల మధ్య ఎంతో అందమైన ప్రకుర్తి మధ్య ఇటువంటి వ్యాధి ఉంది అంటే నమ్మ సౌఖ్యం కావడంలేదు ,ఈ వ్యాధి బారిన పడడానికి గల కారణాలు ఎక్కువ శాతం మంచి నీరు సరిగా లేక పోవడమని అక్కడ ప్రజలు కొంతమంది పరిశోధకలు తెలియజేసారు ,అనేక మార్లు  ఇది విన్న ఉద్దానం ప్రాంతం 
 కవిటి మండలం కి చెందిన ఎన్.ఆర్.ఐ పుల్లట రామకుమార్ మస్కట్ దుబాయ్ దేశాల్లో గత 15 సంవత్సారాలు జాబ్ చేస్తూ  ప్రతి సంవత్సరం ఉద్దానం ప్రాంతం లో వాటర్ ప్లాంట్స్ పెడుతూ వ్యాధి బారిన పడినవారికి కొంత ఆర్థిక సహాయం చేస్తూ మస్కట్ లో కొంతమంది  మిత్రులతో కలిసి పెడుతున్నారు ఒక్కొక్క ప్లాంట్ కి  సుమారు 3 లక్షల రూపాయలు అవుతుంది అని తెలియజేసారు  అలాగే  మస్కట్ కి చెందిన చిరూ మెగా యూత్ ఫోర్స్ (CMYF )వారు ఆర్థిక సహాయం తో కొన్ని ప్లాంట్స్ పెట్టడం జరిగింది) ఇప్పటి వరకు బైరిపురం , బెజ్జిపుట్టుగ , ముత్యాలపేట ,మర్రిపాడు ,తొత్తిడి పుట్టిగ, ఆరు ప్లాంట్స్ పెట్టించిన పులట రామకుమార్ అనేక మంది కి రక్త పరీక్షలు నిర్వహిస్తూ ఉచిత మందులు అందిస్తున్నారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com