ట్రంప్ ను గద్దెదించిన కారణాలు ఇవే!
- November 08, 2020
ఈ సక్కదనాల ట్రంప్ ఓడడానికి కారణాలు చెప్పమంటే.. లచ్చా తొంబై చెబుతం అంటరు యూఎస్ జనాలు. యూఎస్ జనాలే కాదు. కాస్త న్యూస్ అప్డేట్స్ ఫాలో అవుతున్న ప్రతి వారూ.. ఓ వందా నూటేభై కారణాలు చెబుతారు. ఎవరెన్ని కారణాలు చెప్పినా వాటిలో ఓ మూడు రీజన్స్ మాత్రం కచ్చితంగా ఉంటయ్.
నల్లజాతీయుల ఆగ్రహం మరియు ముస్లిముల ఆగ్రహం:
బ్లాక్ అండ్ వైట్స్ గొడవ అక్కడ ఎప్పటి నుంచో ఉంది. కలర్స్ అని అన్నా.. బ్లాక్స్ అని అన్నా.. నల్లజాతీయులు అని పిలిచినా.. ఏదో లోపం మాత్రం కనిపిస్తుంది అక్కడ. సినిమాల్లో కూడా నల్లజాతీయులది లీడ్ రోల్ ఉండాల్సిందే. మెయిన్ లీడ్ కాకున్నా.. మెయిన్ లీడ్ అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ కానీ..
అపొనెంట్ గా కానీ ఉండాల్సిందే. హీరో కి సరిపడా క్యారెక్టర్ లేకుంటే.. నల్లజాతీయులు ఊరుకోరు. అది అక్కడి రూల్. మరి అలాంటిది.. ఒక నల్లజాతీయుడ్ని అనవసరంగా చంపేశారు పోలీసులు. పోలీసుల ఓవరాక్షన్ తో.. తను చనిపోవడం.. తర్వాత యూఎస్ మొత్తం బ్లాక్స్ గొడవకి దిగడం.. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవర్ యాక్షన్ చేయడం చూశాం కదా. ఎప్పుడైతే లూఠీలు జరుగుతాయో.. అప్పుడే బుల్లెట్లు పేలతాయి అని కామెంట్స్ చేసి.. ఇంకాస్త రచ్చ చేశాడు. ఫైనల్ గా వారి ఆగ్రహానికి తట్టుకోలేక.. వైట్ హౌజ్ లోని బంకర్ లో దాక్కున్నాడు ట్రంప్. వైట్ హౌజ్ ని చుట్టుముట్టి.. వారి ఆగ్రహాన్ని చూపించారు నల్లజాతీయులు. వారి మీద ఎప్పటి నుంచో ఉన్న వివక్షకి ఇదే నిదర్శనం అంటూ నినదించారు. అసలే ట్రంపు పార్టీకి వైట్స్ సపోర్టర్స్ అనే పేరుంది. దానికి తగ్గట్లు.. నల్లజాతీయులపై లేని పోని కామెంట్స్ చేసి.. మంటలు రేపాడు.
పొల్యూషన్:
పొల్యూషన్ కూడా అక్కడ ప్రధాన కారణమే. పొల్యూషన్ కి అమెరికా ప్రెసిడెంట్ ని ఓడించేంత పవర్ ఉందా అంటే. అమెరికాలో ఉంది. ట్రంప్ వచ్చాక పొల్యూషన్ ని లైట్ తీసుకున్నాడు. అప్పటి వరకు ఇతర దేశాలతో ఉన్న ఒప్పందాలను లైట్ తీసుకున్నాడు. రూల్స్ బ్రేక్ చేశాడు. ఫైనల్ గా కాలిఫోర్నియా అడువులు తగలబడడం, ఎంతో మంది చనిపోవడం, ఆస్తుల నష్టం తప్పలేదు. అందుకే.. పొల్యూషన్ కి ఇండియా, చైనానే రీజన్ అంటూ లాస్ట్ లో చెప్పిందే చెప్పి.. చెప్పిందే చెప్పి.. పిచ్చి లేపాడు. కాలిఫోర్నియా జనాలు.. అది చూసిన మిగతా యూఎస్ జనాలు.. ట్రంపుని దించి పడేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు.
కరోనా:
ఈ కరోనా గురించి అందరికీ తెలిసిందే. చైనా కూడా ట్రంపు ఓడిపోవడానికి మెయిన్ రీజనే. కరోనా వచ్చి జనాలు చస్తుంటే.. లాక్ డౌన్ పెట్టలేదు. పెట్టినా ఎక్కువ రోజులు ఉంచలేదు. ప్రాణాల కంటే ఆర్థిక వ్యవస్థే ఇంపార్టెంట్ అనేలా కాస్త ఓవర్ యాక్షన్ చేసి.. జనాలలో చీప్ క్యాండెట్ అయిపోయాడు. అమెరికా అధ్యక్షుడిగా ఉండే అర్హత లేదు అని జనాలు ఫిక్స్ అయ్యారు. ఎన్నికల టైంలో వచ్చిన ప్రాబ్లమ్ కావడంతో ఎక్కువ ఎఫెక్ట్ పడింది. ఫైనల్ గా ఓడిపోయారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన