మిర్కాబ్ లో మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ బిల్డింగ్ ప్రారంభం

- November 08, 2020 , by Maagulf
మిర్కాబ్ లో మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ బిల్డింగ్ ప్రారంభం

కువైట్: కువైట్ లోని అల్-మిర్కాబ్ లో వాహనదారులకు మరో పార్కింగ్ ఏరియా అందుబాటులోకి వచ్చింది. నగరంలో మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ బిల్డింగ్ ను ఆర్ధిక మంత్రి బర్రక్ అల్ షీతన్ ఆదివారం ప్రారంభించారు. మినిస్టర్స్ కాంప్లెక్స్ సమీపంలోనే ఈ బిల్డింగ్ ఉంది. అయితే..తొలుత బిల్డింగ్ లోని కొంత భాగాన్ని మాత్రమే పార్కింగ్ కు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన ప్రాంతాన్ని కూడా పార్కింగ్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆదివారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనదారులు తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com