టర్కీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠాను విజయవాడ పోలీసులు అదుపులో..
- February 16, 2016
టర్కీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న రూ.115 కోట్ల విలువైన టర్కీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ఓ లాయర్ భార్య పది మందితో కలిసి ఈ టర్కీ కరెన్సీని మార్కెట్లో చలామణి చేసేందుకు ప్రయత్నించింది. వారి దగ్గర ఒక్కొక్కటీ రూ.5 లక్షల విలువైన వంద టర్కీ లిరా నోట్లు ఉన్నాయి. ఒక్కో లిరా విలువ మన భారతీయ కరెన్సీలో రూ.23 రూపాయలు. అంటే ఒక్కో రూ.5 లక్షల లిరా నోటు రూ.115 కోట్లతో సమానం. ఆ వంద నోట్లను తాము రూ.10 లక్షలకు కొనుగోలు చేశామని రూ.25 లక్షలకు మార్కెట్లో విక్రయిస్తామని ముఠా సభ్యులు చెప్పారు. పోలీసులకు పట్టుబడిన వారిలో వైసీపీ నేత జలీల్, నకిలీ రిపోర్టర్ ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన నోట్లు పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమంలో అపహరించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో ఈ ముఠా టర్కీ కరెన్సీని చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు గుట్టుగా విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







