వచ్చే ఏడాదిలో మరికొన్ని మహిళా డ్రైవింగ్ స్కూల్స్ ప్రారంభించనున్న సౌదీ ప్రభుత్వం
- November 10, 2020
రియాద్:మహిళా సాధికారికత దిశగా సంచలన సంస్కరణలు చేపడుతున్న సౌదీ ప్రభుత్వం..మహిళలు కూడా సొంతంగా డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ గతంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా డ్రైవింగ్ లెసెన్స్ పొందెందుకు మహిళల కోసం ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కూళ్లను కూడా ప్రారంభించింది. అయితే..ప్రస్తుతం కింగ్డమ్ పరిధిలో కేవలం ఐదు డ్రైవింగ్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. రియాద్, దమ్మమ్, జెడ్డా, మదీనా, తబుక్ ప్రాంతాల్లో మాత్రమే మహిళల కోసం డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ స్కూల్స్ లో రద్దీని తగ్గించటంతో పాటు వీలైనంత ఎక్కువ మంది మహిళలు లైసెన్స్ పొందేలా మరికొన్ని డ్రైవింగ్ స్కూల్స్ ను ప్రారంభించాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే స్కూల్స్ ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు జనరల్ డ్రైవింగ్ స్కూల్స్ లో కూడా మహిళలు శిక్షణ పొందేలా అనుమతి ఇచ్చింది. అయితే..పురుషులతో కాకుండా మహిళల కోసం ప్రత్యేక సమయం కేటాయించి లేడీ ఇన్ స్ట్రక్టర్ ఆధ్వర్యంలో మహిళలు డ్రైవింగ్ నేర్చుకునేలా సౌదీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు