కువైట్: ఇక రాత్రి సమయంలోనూ ఫ్లైట్లకు పర్మిషన్..

- November 11, 2020 , by Maagulf
కువైట్: ఇక రాత్రి సమయంలోనూ ఫ్లైట్లకు పర్మిషన్..

కువైట్ సిటీ:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇక నుంచి రాత్రి వేళలో కూడా ఫ్లైట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు 24 గంటల పాటు ఎయిర్ పోర్టు తెరిచే ఉంటుందని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పరిమితి సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్స్ కు అనుమతించిన కువైట్ ప్రభుత్వం...ఇన్నాళ్లు పగటి వేళలో మాత్రమే సర్వీసులకు పర్మిషన్ ఇచ్చింది. అయితే..తాజాగా రాత్రి వేళలో కూడా ఫ్లైట్ సర్వీసులకు అనుమతి ఇస్తూ నైట్ బ్యాన్ ను ఎత్తివేసింది. కానీ, రోజువారీ విమానాల సంఖ్యను మాత్రం పెంచటం లేదని కూడా కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది. గతంలో ఒక రోజులో ఎన్ని విమానాలకు అనుమతి ఇచ్చామో...ఇప్పుడు 24 గంటల్లోనూ అదే సంఖ్యలో విమనాలకు అనుమతి ఉంటుందని చెప్పింది. మరోవైపు కువైట్ నుంచి బయల్దేరే ప్రయాణికులకు హ్యాండ్ బ్యాగులను తమ వెంట తీసుకువెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఇకపై ప్రయాణికులు తమ హ్యాండ్ బ్యాగ్ లను తమతో పాటు క్యాబిన్ లోకి తీసుకెళ్లవచ్చు. ఇదిలాఉంటే..కరోనా ప్రభావం ఎక్కువగా 34 దేశాల నుంచి విమానాల రాకపోకలపై కువైట్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసింది. ఆ 34 దేశాలపై నిషేధానికి సంబంధించి మాత్రం కువైట్ సివిల్ ఏవియేషన్ ఆథారిటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com