యూఏఈ:వ్యాపార రంగానికి యూఏఈ ఊరట..

- November 11, 2020 , by Maagulf
యూఏఈ:వ్యాపార రంగానికి యూఏఈ ఊరట..

యూఏఈ:యూఏఈలోని వ్యాపార వర్గాలకు యూఏఈ ఊరట కలిగించే ప్రకటన చేసింది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యాట్ శాతాన్ని పెంచొచ్చనే సందేహాలను కొట్టిపారేసింది. ఇప్పట్లో వ్యాట్ ను పెంచే ఆలోచనలు లేవని, యధావిధిగా 5 శాతం వ్యాట్ నే కొనసాగిస్తామని స్పష్టతనిచ్చింది. ఈ ఏడాదిలో గత 8 నెలల కాలంలో విలువ ఆధారిత పన్ను(వ్యాట్) ద్వారా 11.6 బిలియన్ ల దిర్హామ్ లు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్లు యూఏఈ ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఎక్సైజ్ పన్నుల ద్వారా 1.9 బిలియన్ ల దిర్హామ్ లు వసూలు అయినట్లు...గతంతో పోలిస్తే ఇది 47 శాతం ఎక్కువని వివరించింది. అయితే...వ్యాట్ ద్వారా వసూలు అయిన నిధులలో 30 శాతం కేంద్ర ప్రభుత్వానికి, 70 శాతం స్థానిక ప్రభుత్వాలకు కేటాయించనున్నారు. అలాగే పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఎక్సైజ్ పన్నులలో 45 శాతం కేంద్రానికి, 55 శాతం లోకల్ గవర్నమెంట్ కు కేటాయిస్తారు. ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, చెక్కెర ఆధారిత బీవరేజెస్ తరహా ఇతర ఎక్సైజ్ ఉత్పత్తులపై వసూలైన నిధులలో 30 శాతం కేంద్రానికి వెళ్తాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వ్యాట్ ద్వారా వసూలైన నిధులను ఫెడరల్ ట్యాక్సీ ఆథారిటీతో కలిసి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించనున్నామని, అదే సమయంలో కోవిడ్ కారణంగా ఎదురవుతున్న ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కునేందుకు పన్ను నిధులు ఉపయోగపడుతాయని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com