విరాళాల స్వీకరణకు నిబంధనలు

- November 11, 2020 , by Maagulf
విరాళాల స్వీకరణకు నిబంధనలు

కువైట్‌ సిటీ: మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ ఎఫైర్స్‌, విరాళాల స్వీకరణకు సంబంధించిన నిబంధనల్ని పేర్కొంటూ ఛారిటబుల్‌ సొసైటీలు, ఆర్గనైజేషన్స్‌కి సర్క్యులర్‌ జారీ చేయడం జరిగింది. మినిస్టీరియల్‌ రిజల్యూషన్‌ నెం.36/2020 ప్రకారమే విరాళాల్ని స్వీకరించాల్సి వుంటుంది. ఫైనాన్షియల్‌ రెగ్యులేషన్స్‌కి వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి డొనేషన్స్‌ స్వీకరించడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు ఛారిటీ మరియు ఫిలాంత్రపిక్‌ ఆర్గనైజేషన్స్‌పై తనిఖీలు జరుగుతుంటాయనీ, ఈ క్రమంలో అక్రమాలు వెలుగు చూస్తే చర్యలు తప్పవని మినిస్ట్రీ హెచ్చరించింది. 4 ఛారిటబుల్‌ సొసైటీలకు సంబంధించిన 20 సైట్స్‌పై ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది. సీరియల్‌ నెంబర్స్‌, నెంబర్‌ ఆఫ్‌ డివైజెస్‌, డోనర్‌ ఐడెంటిఫికేషన్‌ (సివిల్‌ ఐడీ కార్డు సేకరణ) వంటివి తప్పనిసరిగా నిబంధనల్లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com