జరీమానాలు చెల్లించకుండానే వలసదారులు దేశం విడిచి వెళ్ళొచ్చు
- November 11, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్ విడిచి వెళ్ళాలనుకునే వలసదారులు, నవంబర్ 15 నుంచి ఎలాంటి జరీమానాలు చెల్లించకుండానే వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఓవర్ స్టేకి సంబంధించిన జరీమానాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ అవకాశం ఇస్తోంది ఒమన్ ప్రభుత్వం. మినిస్రీ& టాఫ్ లేబర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, దేశంలో వుండాలనుకునేవారు ఖచ్చితంగా తమ స్టేటస్‌ని అప్డేట్ చేసుకోవాలని మినిస్ట్రీ చెబుతోంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లోని మినిస్ట్రీ కార్యాలయాన్ని సందర్శించి దేశం విడచి వెళ్ళడానికి అనుమతి పొందవచ్చు. అంతకు ముందు వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ వెబ్సైట్ లేదా సనద్ కార్యాలయాల ద్వారా ‘అప్లికేషన్ ఫర్ డిపాచ్యూర్’ పూర్తి చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







