బైడెన్-ట్రంప్ మధ్య కార్చిచ్చు ఇప్పట్లో చల్లారుతుందా?
- November 11, 2020
ట్రంప్ మొండికేసేలా ఉన్నాడు. జో గెలిచినా సరే నేను కుర్చీ దిగేదిలేదు బ్రో అంటున్నాడు. ఈ ట్రంపరితనం కొత్తేం కాదు. ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచే ఈ తరహా కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. కాని, ఈసారి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో కూడా అచ్చం ట్రంప్ మాట్లాడినట్టే మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజా తీర్పు కూడా వచ్చేసింది. అయినా సరే అమెరికా పెద్దల తీరు మారడం లేదు. గెలిచిన అభ్యర్థికి అధ్యక్ష పీఠం అప్పగించకపోతే ఏం చేయాలన్నది అమెరికా రాజ్యాంగంలో కూడా లేదు. దీంతో బైడెన్‌ను ఆటాడుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు ట్రంప్.
బైడెన్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చినా సరే.. ఎన్నికల్లో తానే గెలిచానని స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. ఆ వ్యాఖ్యలను సమర్ధిస్తూ మైక్ పాంపియో కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. రెండోసారి అధికారం చేపట్టబోతున్న ట్రంప్ పాలనా యంత్రాంగానికి అధికార మార్పిడి సజావుగా సాగుతుందని చెప్పాడు. నిజానికి బైడెన్‌కు అధికారిక బాధ్యతలు అప్పగిస్తాం అని చెప్పాలి. కాని, పాంపియో మాత్రం ట్రంపరితనాన్నే వెనకేసుకొచ్చాడు. పాంపియో ఉద్దేశం చూస్తుంటే విదేశీ వ్యవహారాలను బైడెన్‌కు అంత ఈజీగా అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు.
చట్టబద్దమైన ప్రతి ఓటును లెక్కించాల్సిందేనని మాట్లాడుతున్నాడు మైక్ పాంపియో. 2000 సంవత్సరంలో ఎన్నికల ప్రక్రియ 37 రోజులు పట్టిందని, ఈసారి కూడా ఎన్ని రోజులు పట్టినా సరే చట్టబద్దమైన ఓట్లను లెక్కపెట్టాల్సిందేనంటున్నాడు. ఓవైపు ఓట్ల లెక్కింపు రచ్చ జరుగుతున్నా సరే.. ఏడు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు పాంపియో. మరోవైపు అధికార బదిలీని ఎవరూ ఆపలేరని జో బైడెన్ క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటికే ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు బైడెన్. చూస్తుంటే.. అధికార మార్పిడి అనే కార్చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







