గంటసేపు మూగబడ్డ యూట్యూబ్
- November 12, 2020
ఓ గంటసేపు యూట్యూబ్ ఆగిపోతే ప్రపంచమే ఆగిపోయినంత పనైంది. ఎందుకు పనిచేయడం లేదు.. కారణమేంటి అంటూ చాలా మంది ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. గురువారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా సుమారు గంటకు పైగా యూట్యూబ్ పనిచేయలేదు. ఏ వీడియె ఓపెన్ చేసినా.. ప్లే కాకుండా ఎర్రర్ కనిపించింది. దీంతో చాలా మంది యూట్యూబ్ యూజర్స్ ఈ విషయమై యాజమాన్యానికి కంప్లైంట్ చేశారు. దీంతో యూట్యూబ్ యాజమాన్యం తమ ట్విట్టర్ ద్వారా సమాధానం తెలిపింది.
'గురువారం సుమారు ఉదయం 5.53నిమిషాల నుంచి పనిచేయడం ఆగిపోయింది. అది గమనించిన మా సిబ్బంది సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లోనే ఉంది' అని యూట్యూబ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. 'ఇది కేవలం ఒక్కరిద్దరికి మాత్రమే వస్తున్న సమస్య కాదు.. టెక్నికల్ సమస్య కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వీడియోలు ప్లే అవడం లేదు, మేము దీన్ని త్వరలోనే పరిష్కరిస్తామంటూ' సమాధానమిచ్చింది.
తిరిగి గురువారం ఉదయం 7.15 నిమిషాల నుంచి యూట్యూబ్ యాథావిథిగా పనిచేయడం మొదలుపెట్టింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడియోలు ప్లే అవుతున్నాయి.
అయితే యూట్యూబ్ తో పాటు గూగుల్ ప్లే స్టోర్ కూడా కాసేపు పనిచేయకుండా పోయిందట. అండ్రాయిడ్ యాప్స్ కొన్ని డౌన్ లోడ్ అయినప్పటికీ.. అవి పూర్తిగా ఇన్స్‌టాల్ అవలేదు. మరోవైపు గూగుల్ టీవీ కూడా కాసేపు సతాయించి.. కొద్దిసేపటి తర్వాత తిరిగి పుంజుకుని పనిచేయడం మొదలుపెట్టిందట.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







