అజ్జు మహాకాళి దర్శకత్వం లో 'రీసెట్'
- November 12, 2020'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా ‘, ' నువ్వు తోపు రా' తదితర చిత్రాలతో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల 'రీసెట్' పేరుతో మరో విభిన్నమైన చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా అజ్జు మహాకాళి దర్శకునిగా పరిచయమౌతున్నారు. సుఖ స్టూడియోస్ సమర్పణలో హైలైట్ విజువల్స్, కారా బూందీ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ రోజు (నవంబర్ 12) హీరో సుధాకర్ కోమాకుల పుట్టినరోజు. ఈ సందర్బంగా టైటిల్ పోస్టర్
విడుదల చేశారు.
దర్శకుడు అజ్జు మహాకాళి మాట్లాడుతూ- ''న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీ లో డిప్లమో ఇన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసాను. సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన 'నువ్వు తోపు రా' కి కథ- మాటలు అందించాను. దర్శకునిగా ఇదే నా తొలి ప్రయత్నం. కథ నచ్చి సుధాకర్ వెంటనే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. లాక్ డౌన్ 1.0 టైం లో జరిగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రపంచం లాక్ డౌన్ అయినాకనే అతని ప్రపంచం ఓపెన్ అయ్యింది. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే- వాస్తవం, కల్పితం కన్నా కిరాక్ ఉంటది. డిసెంబర్ లో చిత్రీకరణ మొదలుపెడతాం'' అని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా : సిద్ధం మనోహర్,
సంగీతం: డెన్నిస్ నార్టన్ ,
ఎడిటింగ్: నవీన్ నూలి, రచన - దర్శకత్వం: అజ్జు మహాకాళి .
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







