సెల్ఫీ తో చిక్కిన తాగుబోతు

- May 27, 2015 , by Maagulf
సెల్ఫీ తో చిక్కిన తాగుబోతు

సెల్ఫీలు సరదా కోసమే కాదు.. ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతున్నాయి. దుబాయ్ లో.. ట్యునీషియాకు చెందిన ఓ మహిళ ఇలాగే సెల్ఫీతో తన మాన ప్రాణాలను కాపాడుకుంది. తన మంచం మీద ఓ వ్యక్తి తాగి పడుకుని ఉన్నట్లు గమనించిన ఆమె.. వెంటనే అతగాడితో కలిసి ఓ సెల్ఫీ దిగి, దాన్ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేయడంతో పాటు వెంటనే పోలీసులను కూడా అప్రమత్తం చేసింది. ఆమె ఉద్యోగానికి వెళ్లి తిరిగి వచ్చి తన ఫ్లాటు తలుపులు తీసి చూసేసరికి.. గుర్తుతెలియని వ్యక్తి తన మంచం మీద పడుకుని ఉన్నట్లు గమనించింది. కాసేపు షాకైనా.. తర్వాత జాగ్రత్తగా వెళ్లి అతడి సెల్ఫీ తీసింది. వెంటనే పోలీసులకు చెప్పడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ''నేను ఇంటికి వచ్చేసరికి ఓ తాగుబోతు నా పక్కలో పడుకుని ఉన్నాడు. అతడు దొంగిలించేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యాడు'' అని కేప్షన్ పెట్టింది. దాంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించింది. అయితే, ఆ మహిళ భావించినట్లుగా అతడు దొంగ కాదని, తాగేసి తెలియక వచ్చాడని దుబాయ్ సీఐడీ విభాగం అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సౌరీ తెలిపారు. ఆ అపార్టుమెంట్ వాచ్ మన్ అతడికి స్నేహితుడు కావడంతో వాళ్ల ఇంటికి వచ్చాడని, బాగా తాగడంతో నిద్ర వస్తుంటే ట్యునీషియా మహిళ ఫ్లాటులోకి దూరి ఆమె మంచం మీద పడుకున్నాడని చెప్పారు. మొత్తానికి సదరు తాగుబోతును మాత్రం అనుమతి లేకుండా ఇంట్లో దూరినందుకు అరెస్టు చేసి కేసు పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com