విజయవాడ లో "బ్రహ్మోత్సవం"
- May 27, 2015
ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీ మంతుడు' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. జూన్ చివరి వారంలోపు ఈ సినిమాని పూర్తి చేసి జూలై 17న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే... మహేష్ తన తదుపరి చిత్రం శ్రీ కాంత్ అడ్డాలతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ఖరారు చేస్తూ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న చిత్ర ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ పనులు చేస్తున్న దర్శకుడు శ్రీకాత్ అడ్డాల ఈ చిత్ర కథకు విజయవాడ బ్యాక్ డ్రాప్ని ఎంచుకున్నాడట. దాంతో 'బ్రహ్మోత్సవం' సినిమా చాలా భాగం షూటింగ్ విజయవాడలోనే ఉంటుందని సమాచారం. దానికోసం ఈ చిత్ర దర్శకుడితో పాటు కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి విజయవాడ వెళ్లి లోకేషన్లను పరిశీలించారట. వాటిలో ప్రకాశంబ్యారేజ్, కనకదుర్గమ్మ గుడి, బెంజ్ సర్కిల్ వంటి ప్రదేశాలను ఎంచుకున్నారని తెలుస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కోసం భద్రాచలం రామాలయంలో, 'ముకుంద' సినిమా కోసం ద్రాక్షారామం గుడిలో కొన్ని ముఖ్యసన్నివేశాలు షూట్ చేసిన శ్రీకాంత్ ఈసారి 'బ్రహ్మోత్సవం' కోసం విజయవాడ 'దుర్గగుడి'లో షూట్ చేయస్తాడనమాట. పివిపి బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ సరసన ముగ్గురు భామలు నటిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







