కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన బెంగాలీ దిగ్గజ నటుడు సౌమిత్ర ఛటర్జీ
- November 15, 2020
కోల్కత్తా: కరోనాతో దాదాపుగా 40 రోజుల నుంచి పోరాడుతున్న బెంగాలీ దిగ్గజ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఆదివారం కోల్కత్తాలో కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలు. గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించిందని, ఆయనను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ఈ నటుడు బెంగాలీ సినీ పరిశ్రమలో విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్నారు. దిగ్గజ బెంగాలీ దర్శకుడు సత్యజిత్రే క్లాసిక్ మూవీ 'అపుర్ సంసార్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సౌమిత్ర పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సత్యజిత్రే దర్శకత్వం వహించిన చాలా చిత్రాల్లో సౌమిత్ర నటించడం విశేషం. ఘరె బైరె, అరణ్యర్ దిన్ రాత్రి, చారులత చిత్రాలు సౌమిత్రకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు