కువైట్:బ్రాండెడ్ లేబుల్స్ తో నకిలీ పెర్ఫ్యుమ్ తయారీ..2,000 బాటిల్స్ స్వాధీనం
- November 16, 2020
కువైట్ సిటీ:బ్రాండెడ్ పెర్ఫ్యూమ్ పేరుతో నకిలీ పెర్ఫ్యూమ్ తయారు చేస్తున్న ముఠాను కువైతీ వాణిజ్య అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి మార్కెట్ చేయటానికి సిద్ధంగా ఉన్న రెండు వేల పెర్ఫ్యూమ్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అల్ ఫర్వానియాలో పెర్ఫ్యూమ్ తయారీకి అనుబంధంగా ఉన్న ఓ గోడౌన్ లో అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించగా..నకిలీ ముఠా గుట్టు బయటపడింది. ఇంటర్నేషనల్ బ్రాండ్లతో పాటు ప్రాంతీయ బ్రాండ్ల పెర్ఫ్యూమ్ కు ఏ మాత్రం తీసిపోకుండా నకిలీ లేబుల్స్ తయారు చేసిన ముఠా...నాసిరకం పెర్ఫ్యూమ్ బాటిల్స్ కు బ్రాండెడ్ లేబుల్స్ వేసి మార్కెట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గోడౌన్ లోని బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు