అంతరిక్ష రంగంలోకి ఒమన్...2024లో తొలి శాటిలైట్ ప్రయోగానికి సన్నాహాలు
- November 16, 2020
మస్కట్:కృత్రిమ మేథస్సు, టెక్నాలజీ అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడే దిశగా పయనిస్తున్న ఒమన్...ఇక అంతరిక్ష రంగంలోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. తొలి ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. 2024లో ఫస్ట్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. 50వ జాతీయ దినోత్సవ వేళ ఈ విషయాన్ని ఒమన్ శాటిలైట్ ప్రయోగ వివరాలను ప్రకటించింది. నిజానికి సొంతంగా ఉపగ్రహ ప్రయోగం నిర్వహించి..అంతరిక్షయాన దేశాల జాబితాలో చేరాలని ఒమన్ 2006 నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతరిక్ష గమ్యంలో లక్ష్యానికి చేరువవుతున్నట్లు, స్పేస్ ప్రోగ్రామ్ కి సంబంధించి ముఖ్య విషయాలపై 2021లో మరిన్ని విషయాలను వివరించనున్నట్లు ఒమన్ ప్రభుత్వం తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతికను అందిపుచ్చుకున్న దేశంగా ఒమన్...అంతరిక్ష రంగంలోని విజయాలు సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..