యూఏఈ పౌరులు, నివాసితులు, నివాసితులు కాని వారికి ఫ్రీలాన్సర్ లైసెన్స్
- November 16, 2020
యూఏఈ:48 రకాల వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి అబుధాబిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ కొత్త ‘ఫ్రీలాన్సర్ లైసెన్స్’ని ప్రకటించింది. ఈ లైసెన్స్, నివాసితులు, నివాసితులు కానివారు అలాగే యూఏఈ పౌరులకు అందుబాటులో వుంటుంది. దరఖాస్తుదారులు లైసెన్స్ పొందాలంటే సంబంధిత స్కిల్ సెట్‌ని కలిగి వుండాలి. పబ్లిక్ లేదా ప్రైవేటు సెక్టార్ సంస్థల్లో పనిచేసినట్లయితే, తాము చేస్తున్న పనికి అనుబంధమైనదైతే ముందస్తు అనుమతి కూడా పొందవలసి వుంటుంది. దరఖాస్తుదారులు రెసిడెన్స్ వీసా కోసం దరఖాస్తు చేయవచ్చునని అథారిటీస్ పేర్కొన్నాయి. ఆఫీస్ స్పేస్ తప్పనిసరి కాదు. ఈ కొత్త లైసెన్స్ విధానం ద్వారా ఆయా విభాగాల్లో నిపుణులకు అవకాశం ఏర్పడుతుంది. గృహిణులకు, విద్యార్థులకు వయసు మళ్ళినవారికి ఈ లైసెన్స్ విధానం కొత్త అవకాశాల్ని కలిపిస్తుంది. రిమోట్ వర్కింగ్ అవకాశాల్ని మెరుగుపర్చుతుంది ఈ విధానం.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం