కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వంలో 'రాళ్లలో నీరు'
- November 16, 2020
హైదరాబాద్:అనేక డాక్యుమెంటరీలు తీసి, చాలా రచనలు చేసి, సినిమాపై మంచి పరిజ్ఞానం కలిగిన కిరణ్మయి ఇంద్రగంటి తొలిసారిగా డైరెక్ట్ చేసిన చిత్రం 'రాళ్ళలో నీరు'.
అనల్ప అండ్ ఫ్రెండ్స్ పతాకంపై అనల్ప ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్ ఇందులో ప్రధాన తారాగణం.
దర్శకురాలు కిరణ్మయి ఇంద్రగంటి మాట్లాడుతూ- ''నేను M.A ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునే రోజుల్లో నార్వేజియన్ నాటకం 'ఏ డాల్స్ హౌస్' విపరీతంగా ఆకట్టుకుంది. ఎప్పటికైనా ఆ నాటకాన్ని తెరకెక్కించాలనుకున్నాను. ఆ కల ఇప్పటికి నెరవేరింది. తెలుగులో 'కన్యాశుల్కం' ఎలానో, ఇంగ్లీషులో 'డాల్స్ హౌస్' అంత ఫేమస్. 19వ శతాబ్దానికిచెందిన ప్రముఖ రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈ నాటకం రాసారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్థాట్స్ తో ఉండే ఈ నాటకం థీమ్ ని
తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసాను. ఇందులో మొత్తం ఐదు పాత్రలే ఉంటాయి. మనుషుల్లోఅంతర్గతంగా
ఉండే లోపాల్ని, భావోద్వేగాల్ని ఒడిసిపట్టే విధంగా ఇందులో కథాంశంఉంటుంది. కథకు తగ్గట్టుగా కాకినాడలో ఓ ఇల్లు దొరికింది. మేజర్ పోర్షన్ అక్కడే చిత్రీకరించాం.
కాకినాడలో మొత్తం 28 రోజులు షూటింగ్ చేశాం. ఫస్ట్ కాపీ తో సహా సినిమా రెడీ గా ఉంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్ లో జరిగిన అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్నిప్రదర్శించాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎడిటింగ్: మార్తాండ్ . కే. వెంకటేష్, కెమెరా: RR కోలంచి, సౌండ్ డిజైనర్: తేజ ASGK, నిర్మాత: అనల్ప,
రచన-దర్శ కత్వం: కిరణ్మయి ఇంద్రగంటి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







