చెన్నయ్, హైద్రాబాద్‌లకు ఒమన్ ఎయిర్ విమానాలు
- November 16, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్, భారతదేశంలోని చెన్నయ్ అలాగే హైద్రాబాద్ నగరాలకు వారంలో రెండు రోజులపాటు నడిచే విమానాల్ని ప్రకటించింది. నవంబర్ 19 నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 31 వరకు వీటి షెడ్యూల్స్‌ని ఖరారు చేశారు. ఒమన్ ఎయిర్ వెబ్సైట్ అలాగే ఎయిర్ లైన్ కార్యాలయాలు, ట్రావెల్ ఏజెంట్ల వద్ద పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ప్రయాణీకులు మాస్క్ ధరించడం తప్పనిసరీ అనీ, విమానంలోకి ఎక్కేముందు, దిగేముందు ప్రయాణీకుల మధ్య తగిన దూరం అవసరమనీ ఒమన్ ఎయిర్ పేర్కొంది. క్యాబిన్ సిబ్బంది వ్యక్తిగత భద్రతా సాధనాలు ధరించాల్సి వుంటుందనీ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మీల్ సర్వీస్ కూడా మార్చడం జరిగిందని ఒమన్ ఎయిర్ వెల్లడించింది. ఒమన్ నుంచి బయల్దేరేవారు ప్రీ-డిపాచ్యూర్ రిక్వైర్మెంట్స్ తప్పక కలిగి వుండాలి. ఆ వివరాలు ఒమన్ ఎయిర్ వెబ్సైట్లో వుంటాయి. ఆయా డెస్టినేషన్లకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా కలిగి వుండాల్సిందే. ఈ వివరాలు సివిల్ ఏవియేషన్ అథారిటీ వెబ్సైట్లో వుంటాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఒమన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు