సాయిరామ్ శంకర్ 'రిసౌండ్' చిత్రం షూటింగ్ పునఃప్రారంభం
- November 16, 2020
హైదరాబాద్ :హీరో సాయిరామ్ శంకర్ ఒక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్. మురళీకృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. సాయిరామ్ శంకర్ సరసన నాయికగా రాశీ సింగ్ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి 'రిసౌండ్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ వినగానే మాసీగా ఉండి, ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో సోమవారం పునఃప్రారంభమైంది. ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ప్రారంభమైన షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
'రిసౌండ్' మూవీని సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, స్వీకార్ అగస్తి సంగీత బాణీలు సమకూరుస్తున్నారు.
తారాగణం:
సాయిరామ్ శంకర్, రాశీ సింగ్, పోసాని కృష్ణమురళి, అరవింద్ కృష్ణ, అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్, 'అదుర్స్' రఘు, పింకీ
సాంకేతిక బృందం:
దర్శకుడు: ఎస్.ఎస్. మురళీకృష్ణ
నిర్మాతలు: సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి
మ్యూజిక్: స్వీకార్ అగస్తి
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్
ఎడిటింగ్: ఉపేంద్ర
ఫైట్స్: నబా స్టంట్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







