మహారాష్ట్రలో కొత్తగా 2,535 కరోనా కేసులు..
- November 16, 2020
ముంబై:భారత దేశంలో మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 46 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వంద లోపు మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,49,777కు, మరణాల సంఖ్య 46,034కు పెరిగింది.
మరోవైపు ఇవాళ ఒక్కరోజే 3,001 మంది కరోనా రోగులు కోలుకుని వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 16,18,380కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 92.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 84,386 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







