కువైట్: ఆన్ లైన్ ఓపెన్ హౌజ్ ను ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ
- November 17, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారతీయుల సమస్యలను తెల్సుకొని వాటిని పరిష్కారించేందుకు చేపట్టిన ఓపెన్ హౌజ్ ను ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25న బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆన్ లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కువైట్ లోని భారతీయులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపింది. అయితే..ఆన్ లైన్ మీటింగ్ ఐడీ పొందెందుకు ముందుగానే తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ హౌజ్ లో పాల్గొనాలని అనుకునే వారు...పాస్ పోర్టులో ఉన్న తమ పూర్తి పేరు, సివిల్ ఐడీ నెంబర్, కాంటాక్ట్ నంబర్, కువైట్ లో ప్రస్తుతం ఉంటున్న పూర్తి అడ్రస్ తో పాటు ఓపెన్ హౌజ్ లో తాము ఎలాంటి సమస్యను చెప్పదల్చుకున్నారో దానికి సంబంధించి క్లుప్తంగా వివరిస్తూ ముందుగా ఎంబసీకి [email protected] ద్వారా మెయిల్ చేయాలి. మెయిన్ పంపిన వారికి ఓపెన్ హౌజ్ ఆన్ లైన్ మీటింగ్ కు సంబంధించి ఐడీ వివరాలను పంపిస్తారు. ఆ ఐడీ ద్వారా ఓపెన్ హౌజ్ లో పాల్గొని తమ సమస్యను ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చరు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు