డ్రగ్స్ వినియోగానికి 10,000 దిర్హాముల జరీమానా, జైలు శిక్ష
- November 17, 2020
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఎవరూ డ్రగ్స్ అలాగే సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (మత్తు మందులు, మాదక ద్రవ్యాలు) వినియోగించరాదనీ, యువత ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, ఒకవేళ ఈ కేసుల్లో చిక్కితే రెండేళ్ళకు తక్కువ కాకుండా జైలు శిక్ష, 10,000 దిర్హాములకు పై బడి జరీమానా విధించే అవకాశం వుందని స్పష్టం చేసింది. మత్తు మందులు, మాదక ద్రవ్యాల వినియోగంపై హెచ్చరికలు జారీ చేసేలా ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంబంధిత చట్టాల సమాచారాన్ని అందుబాటులో వుంచుతున్నారు. ఏ విధంగానూ డ్రగ్స్‌ని సేవించడం మంచిది కాదని ఆర్టికల్ 34 చెబుతోంది. డ్రగ్స్ వినియోగం, సరఫరాపై సోషల్ మీడియా ద్వారాగానీ, ఇంకే విధంగా అయినా నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇస్తే, అది కూడా క్రిమినల్ చర్యగానే భావిస్తారు. కేసుల తీవ్రతను బట్టి ఆయా నేరాల్లో మరణ శిక్షలు కూడా వుంటాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







