జిహెచ్‌ఎంసి ఎన్నికల సందడి షురూ
- November 17, 2020
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మంగళవారం విడుదుల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఆయన మీడియా ముందు వెల్లడించారు. డిసెంబర్ 1న జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, 4న కౌంటింగ్, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, 20న నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు 24న చివరి రోజు అని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి రిజర్వేషన్లు ప్రభుత్వానికి సంబందించినవని, పాత రిజర్వేషన్లు అయిన 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు ఉంటాయని, బ్యాలెట్ పేపర్లు తెలుపు రంగులోనే ఉంటాయని చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించామని, ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 18 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 74.04 లక్షల ఓట్లు ఉన్నాయి. పురుషులు 52.09 శాతం, మహిళలు 47.90 శాతం ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ 79,290 ఓటర్లతో అతిపెద్ద డివిజన్‌గా కాగా.. 27,997 ఓటర్లతో రామచంద్రాపురం డివిజన్ అతిచిన్న డివిజన్‌గా ఉంది. బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండగా, అన్ని డివిజన్‌ల కంటే ఫతేనగర్‌లో ట్రాన్స్‌జెండర్లు అత్యధికంగా ఉన్నారు.
రిజర్వేషన్ల వివరాలు.. షెడ్యూల్!
జిహెచ్‌ఎంసి మేయర్ పదవి : మహిళ (జనరల్) ఎస్‌టి 2, ఎస్‌సి 10, బిసి 50, జనరల్ మహిళ 44, జనరల్ 44
- రేపటి నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరణ
- 21న నామినేషన్ల పరిశీలన
- 24న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
- డిసెంబర్ 1న పోలింగ్
- డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







