తాను దొరక్కపోతే నేను సింగిల్ గా ఉండిపోవటానికైనా రెడీ - త్రిషా
- November 17, 2020
దశాబ్ద కాలం పాటు తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్గా దుమ్మురేపింది చెన్నై బ్యూటీ త్రిష. ప్రస్తుతం అడపాదడపా తమిళ సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడు త్రిషకు ఇప్పుడు 37ఏళ్లు. అయినప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా గడిపేస్తోంది. దీంతో ఆమె ఎక్కడికెళ్లినా పెళ్లెప్పుడు అన్న ప్రశ్న కామన్ అయిపోయింది. గతంలో చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుని ప్రత్యేక విమానంలో విహారయాత్రకు కూడా వెళ్లొచ్చింది.
అయితే ఏం జరిగిందో తెలీదు గానీ.. ఆ వివాహం క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి త్రిష మళ్లీ పెళ్లి ఊసెత్తడం లేదు. ఇటీవల నటుడు శింబుతో ఆమెలో ప్రేమలో ఉందని, త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై త్రిష స్పందిస్తూ... ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితేనే నా వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది. అప్పటివరకు సింగిల్‌గానే ఉంటా.
ఒకవేళ అలాంటి వ్యక్తి దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతా’ అని త్రిష స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







