సౌదీ: వివాదస్పద తీర్పులు ఇచ్చిన ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్ వేటు
- November 17, 2020
సౌదీ అరేబియాలో రెండు వేర్వేరు కేసుల్లో వివాదస్పద తీర్పులు ఇచ్చిన ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్ వేటు పడింది. గడ్డం చేయించుకోవటం, హుక్కా తాగటం నిషేధమంటూ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు తీర్పు ఇచ్చినందుకుగాను సౌదీ సుప్రీం జ్యూడిషియల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయవ్యవస్థల్లో వ్యక్తిగత అభిప్రయాలకు తావులేదని మండలి అభిప్రాయపడింది. శాసనపరమైన, చట్టపరమైన ఉల్లంఘనలు జరిగినప్పుడు ఆ మేరకు తీర్పులు ఉండాలని అభిప్రాయపడింది. అంతేగానీ మగవాళ్లు షేవింగ్ చేసుకోవద్దు, హుక్కా తాగవద్దు అంటూ ధర్మాసనం అధిష్టించిన న్యాయమూర్తులు తమ వ్యక్తిగత ఉద్దేశాలను తీర్పుల తీర్పుల రూపంలో జనంపై రుద్దేందుకు వీలు లేదని న్యాయ మండలి స్పష్టం చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్ ఎదుర్కుంటున్న ఆ ఇద్దరి జడ్జీల కేసులో విచారణ జరుగుతోందని, అలాగే వారి వెలువరించిన తీర్పులై సమీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించింది. విచారణ తర్వాత ఆ ఇద్దరు న్యాయమూర్తులపై జరిమానా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష