కువైట్, ఖతార్ మధ్య పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు
- November 18, 2020
కువైట్, ఖతార్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం పడేలా ఇరు దేశాలు మరికొన్ని రంగాల్లో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కువైట్ తరపున విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ నాస్సెర్ అల్ సాబా...ఖతార్ తరపున షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ తని పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష పెట్టుబడి, సివిల్ సర్వీస్, పరిపాలన పరమైన అభివృద్ధి, ఇస్లామిక్ అఫైర్స్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రెండు దేశాల మంత్రులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కువైట్ విదేశాంగ మంత్రి షేక్ అహ్మద్ మాట్లాడుతూ..కోవిడ్ మహమ్మారి సమయంలో కువైటీయన్లకు ఖతార్ ప్రభుత్వం, ప్రజలు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఖతార్ లో చిక్కుకుపోయిన వారిని ఆదరించి, తిరిగి స్వదేశం చేరుకునే వరకు కువైటీయన్లపై ఖతార్ ప్రభుత్వం చూపిన ఆదరణను మరువలేమని ప్రశంసించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు