34 బ్యాన్డ్ కంట్రీస్ నుంచి గృహ కార్మికులను రప్పించే ప్రణాళికపై కువైట్ కసరత్తు
- November 18, 2020
కువైట్: అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కమర్షియల్ ఫ్లైట్స్ కి అనుమతి ఇచ్చిన కువైట్..రీసెంట్ గా బ్యాన్ లిస్టులో 34 దేశాల విషయంలో కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇక ఇప్పుడు ఆ 34 దేశాల్లో చిక్కుకుపోయిన డోమస్టిక్ వర్కర్లు తిరిగి కువైట్ చేరుకునేలా తగిన ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జాతీయ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ముబారక్ అల్ హరీస్...డీజీసీఏ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. నిషేధిత జాబితాలో ఉన్న 34 దేశాల నుంచి వచ్చే డొమస్టిక్ వర్కర్ల విషయంలో ఎలాంటి కార్యచరణ అమలు చేయాలనే అంశంపై చర్చించారు. అయితే..డొమస్టిక్ వర్కర్లకు ఎప్పటి నుంచి అనుమతి ఇస్తున్నారనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేమని అన్నారు మంత్రి. మంత్రి మండలి నిర్ణయం మేరకే తేదీ ఖరారు అవుతుందని వెల్లడించారు. తేదీల విషయం ఎలా ఉన్నా...కువైట్ చేరుకునే డొమస్టిక్ వర్కర్లు అంతా..ఖచ్చితంగా క్వారంటైన్ పాటించాల్సి ఉంటుందని, అయితే..క్వారంటైన్ సమయంలో హోటల్ లో ఉంటారా? క్వారంటైన్ సెంటర్ లో ఉంటారా అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు