ఖోర్‌ ఫక్కన్‌ కొండల్లో తప్పిపోయిన బాలురను రక్షించిన షార్జా పోలీసులు

- November 18, 2020 , by Maagulf
ఖోర్‌ ఫక్కన్‌ కొండల్లో తప్పిపోయిన బాలురను రక్షించిన షార్జా పోలీసులు

ఖోర్‌ ఫక్కన్‌ కొండల్లో ఇద్దరు బాలురను పోలీసులు రక్షించారు. బాలుర వయసు 8 మరియు 12 సంవత్సరాలు. బాలురు తమ తల్లి తండ్రులతో కలిసి ఖోర్‌ ఫక్కన్‌లో నివసిస్తున్నారు. పిల్లల ఆచూకీ తెలియక ఆందోళన చెందిన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో బాలురను గుర్తించి వారికి ఆహారం, మంచి నీళ్లు అందించి, వారిలో ఆందోళన తగ్గాక, క్షేమంగా వారిని వారి తల్లితండ్రులకు అప్పగించారు. చిన్నారుల తల్లితండ్రులు తమ పిల్లలు క్షేమంగా రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com