60 ఏళ్ళ పైబడిన వలసదారులు ఫ్యామిలీ వీసాకు మారొచ్చు

- November 19, 2020 , by Maagulf
60 ఏళ్ళ పైబడిన వలసదారులు ఫ్యామిలీ వీసాకు మారొచ్చు

కువైట్: యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళ పైబడిన వలసదారులు, దేశం విడిచి వెళ్ళకూడదనుకుంటే వారి ముందున్న ఒకే ఒక్క అవకాశం వారు ఫ్యామిలీ వీసాకు మారడమే. జనవరి 1 నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది గనుక, దేశంలో వుండాలనుకునే వలసదారులు, తమ వీసా స్టేటస్‌ని ఫ్యామిలీ వీసాగా మార్చుకోవాలి. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ అల్‌ మౌసా మాట్లాడుతూ, జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానున్నందున నిబంధనల పరిధిలోకి వచ్చే వలసదారులైన కార్మికులు తమ స్టేటస్‌ని మార్చుకోవాలని సూచించారు. ఆయా వలస కార్మికుల రెసిడెన్సీ పర్మిట్స్‌ రద్దవుతాయి. వాటిని పునరుద్ధరించే అవకాశం వుండదు. డిగ్రీలు వున్న వలసదారులకు ఈ నిబంధన వర్తించదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com