ఉగ్రవాద వెబ్ సైట్లు, ప్రమోషన్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సౌదీ

- November 19, 2020 , by Maagulf
ఉగ్రవాద వెబ్ సైట్లు, ప్రమోషన్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సౌదీ

సౌదీ: కింగ్డమ్ పరిధిలో ఎవరైనా ఉగ్రవాద సంస్థలకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సౌదీ ప్రాసిక్యూటర్స్. ఉగ్రవాద సంస్థలతో నిషేధిత గ్రూపులతో ఎలాంటి సంబంధాలు ఏర్పర్చుకున్న శిక్షార్హులు అవుతారని వెల్లడించింది. అలాంటి వారికి నేరం రుజువు అయితే పదేళ్ల జైలు శిక్ష 5 మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కింగ్డమ్ పరిధిలోని ప్రజలు ఉగ్రవాద సంస్థలకు సంబంధించి వెబ్ సైట్ లను నిర్వహించటం, ఉగ్రవాద భావజాలన్ని ప్రచారం చేయటం నేరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తమ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఉగ్రవాద సంస్థలు, నిషేధిత గ్రూపులతోగానీ, ఆయా సంస్థల సభ్యులతో గానీ కాంటాక్ట్ లో ఉండటం, వారికి ఫైనాన్సింగ్ చేయటం, పేలుడు పదార్ధాల తయారీ వీడియోలనూ పబ్లిష్ చేయటం, ఉగ్రవాదుల భావజాలాన్ని ప్రచారం చేయటంతో పాటు టెర్రరిస్టు గ్రూపులకు సహాయం చేసే ప్రతి చర్యపై నిషేధం ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ఇటీవలె జెడ్డాలో చోటు చేసుకున్న బాంబు దాడిలో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు తామే కారణమంటూ డేష్ గ్రూపు ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో సౌదీ అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com