బీహార్ రగిల్చిన చిచ్చు..కాంగ్రెస్ లో అనిశ్చితి..

- November 19, 2020 , by Maagulf
బీహార్ రగిల్చిన చిచ్చు..కాంగ్రెస్ లో అనిశ్చితి..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లో బిహార్ చిచ్చు చివరికి రాజీనామాల వైపు వ్యవహారం మళ్లింది. అయితే బిహార్ ఓటమిపై సమగ్రంగా విశ్లేషణ జరగాల్సిందేనని అన్ని పక్షాలూ పట్టుబడుతున్నాయి. బిహార్ ఘోర పరాభవానికి నైతికంగా బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి శక్తిసింగ్ గోలీ ఇప్పటికే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. ఈయనతో పాటు బిహార్ పీసీసీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా కూడా రాజీనామా చేసినట్లు సమాచారం.

అయితే అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయానికి ఆయన వేచి చూస్తున్నట్లు ఆయన వర్గం అంటోంది. ఝా మాత్రం రాజీనామా విషయంలో ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. రాజీనామా విషయంపై ఝాను వివరణ కోరగా... ''ఆ విషయంపై నేను బహిరంగంగా స్పందించను. పార్టీ ఫోరంలోనే మాట్లాడతా. పార్టీ నేతలందరం కలిసి కూర్చుంటాం. ఓటమిని సమీక్షించుకుంటాం. హైకమాండ్ ఏది చెపితే దాన్ని శిరసావహిస్తాం.'' అని ఝా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com