స్వదేశీ కార్మికుల కనీస వేతనాలను సవరించిన సౌదీ ప్రభుత్వం

- November 20, 2020 , by Maagulf
స్వదేశీ కార్మికుల కనీస వేతనాలను సవరించిన సౌదీ ప్రభుత్వం

రియాద్:సౌదీ పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందే దిశగా సౌదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో పని చేస్తున్న స్వదేశీ కార్మికుల కనీస వేతనాన్ని 4000 రియాల్స్ కు పెంచుతూ సవరణలు చేసింది. నితాఖాత్ ప్రొగ్రామ్ లో భాగంగా సౌదీయుల్లో నిరుద్యోగ శాతాన్ని తగ్గించేందుకు ఈ సవరణలు దోహదం చేస్తాయని మానవ వనరులు, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో సౌదీ సంస్థల్లో స్వదేశీయులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు అవుతాయని అభిప్రాయపడింది. అయితే..ఈ పెంచిన కనీస వేతనాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో మాత్రం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలాఉంటే..పెంచిన వ్యాట్ పై కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత సమీక్షిస్తామని వాణిజ్య, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 5 శాతంగా ఉన్న వ్యాట్ ను గత జులైలో 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com