బహ్రెయిన్:అక్రమంగా పోగాకు ఉత్పత్తుల తరలింపు, అమ్మకాల కేసులో 9 మంది అరెస్ట్
- November 20, 2020
మనామా:నిషేధిత పోగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలించటం, పోగాకు ఉత్పత్తులను అమ్ముతున్న కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మనామా గవర్నరేట్ పోలీస్ డీజీ తెలిపిన వివరాల ప్రకారం తొమ్మిది మంది సభ్యులు ఉన్న ముఠా బహ్రెయిన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిషేధిత ఉత్పత్తులు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ తొమ్మిది మంది ముఠాలో మొత్తం గ్యాంగ్ ను ఒకరు ఆర్గనైజ్ చేస్తుండగా...మరొకరు నిషేధిత ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేస్తుంటారని వివరించారు. గల్ఫ్ దేశాల్లోని మరో దేశంలో ఉన్న మూడో వ్యక్తి ద్వారా సరుకును అందుకుంటన్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి మొత్తం BD3,50,000 విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







