సుశీలమ్మకు శతమానంభవతి
- November 20, 2020
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పి సుశీల పాడిన తెలుగు సినీగీతాలలోని 100 ఆణిముత్యాలవంటి పాటలతో "గానకోకిల పాటకు పట్టాభిషేకం" అనే కార్యక్రమాన్ని అంతర్జాలం ద్వారా 21వ తేదీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:00కు ప్రముఖ నటీమణి ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు చేతులమీదుగా ప్రారంభించనున్నారని, 12 మంది ప్రముఖ గాయనీమణులు సుశీల పాటలను ఆలపించి అలరించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు, వంశీ ఇంటర్నేషనల్ మరియు సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధిక మంగిపూడి, సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, శారదా కళాసమితి అధ్యక్షులు దోగిపర్తి శంకర్రావు తెలియజేశారు.
12 గంటలపాటు నిర్విరామంగా కొనసాగనున్న ఈ సంగీత మహోత్సవ కార్యక్రమంలో రాధిక నోరి (అమెరికా), విజయలక్ష్మి భువనగిరి, సురేఖ మూర్తి దివాకర్ల, వేదాల శశికళ స్వామి, శారదా రెడ్డి, శివశంకరి గీతాంజలి, శారద సాయి, శ్రీదేవి, రావూరి మాధవి, హిమబిందు, శైలజా చిలుకూరి (సింగపూర్), సౌభాగ్యలక్ష్మీ (సింగపూర్) 12 మంది సుమధుర గాయనీమణులు 100 పాటలను ఆలపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలలనుండి సినీ సంగీత ప్రేమికులు, సుశీల అభిమానులు అందరూ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరిగే ప్రత్యక్ష ప్రసారం లో చూడవచ్చునని తెలుపుతూ నిర్వాహకులు అందరికీ సాదర ఆహ్వానం పలికారు.
ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసారం
https://www.facebook.com/permalink.php?story_fbid=189891509447208&id=108993030870390
యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం
https://youtu.be/Lgz9psISSgQ
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు