కువైట్: గృహ కార్మికుల రీఎంట్రీకి అనుమతి..ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

- November 20, 2020 , by Maagulf
కువైట్: గృహ కార్మికుల రీఎంట్రీకి అనుమతి..ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

కువైట్ సిటీ:ప్రయాణ ఆంక్షలతో ప్రపంచంలోని పలు దేశాల్లో చిక్కుకుపోయిన డొమస్టిక్ వర్కర్లు...కువైట్ కు తిరిగి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 34 దేశాల నుంచి విమానాలను అనుతమించకపోవటంతో ఇన్నాళ్లు ఆయా దేశాల నుంచి కార్మికులు కువైట్ చేరుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. నిషేధిత దేశాల జాబితాలో భారత్, పిలిప్పైన్స్, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే...ఇళ్లలో పని చేసే డొమస్టిక్ వర్కర్ల కొరతతో కువైటీయన్లు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో డొమస్టిక్ వర్కర్లకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని పలువురి నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఇదే అంశంపై అధ్యయనం చేసిన అధికారుల బృందం...ఇప్పటికే పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై....నిషేధిత జాబితాలో ఉన్న ఆ 34 దేశాల డొమస్టిక్ వర్కర్లను అనుమతించటంపై కార్యాచరణను రూపొందించింది. అధికారుల బృందం ప్లాన్ రిపోర్ట్ ను మంత్రివర్గ ఉన్నతస్థాయి సమావేశం ఎట్టకేలకు ఆమోదించింది. దీంతో ఇక భారత్, ఈజిప్ట్ దేశాల నుంచి డొమస్టిక్ వర్కర్లకు కువైట్ చేరుకునేందుకు అడ్డంకులు తొలిగిపోనున్నాయి. అయితే..కువైట్ చేరుకునే డొమస్టిక్ వర్కర్లు...ఖచ్చితంగా రెండు వారాల పాటు ప్రత్యేక నివాస ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉండాలని మంత్రివర్గం సూచించింది. స్పాన్సర్లు కార్మికుల వివరాలు ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేయటంతో పాటు కువైట్ చేరుకోగానే వారిని ఎయిర్ పోర్టు నుంచి క్వారంటైన్ కు తరలించే బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే...మంత్రివర్గ నిర్ణయం అమలులోకి రాగానే.. రాబోయే నాలుగైదు నెలల్లో నిషేధిత జాబితాలో ఉన్న 34 దేశాల నుంచి దాదాపు 80 వేల మంది డొమస్టిక్ వర్కర్లకు కువైట్ చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com