రూపే కార్డు ఫేజ్-2ను ప్రారంభం
- November 20, 2020
న్యూఢిల్లీ: భూటాన్ ప్రధాని లోతే షేరింగ్, భారత్ ప్రధాని మోడి సంయుక్తంగా ఫేజ్-2 రూపేకార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా లోతే మాట్లాడారు. భారత్‌లో కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో ప్రధాని నాయకత్వం అద్భుతమని కొనియాడారు. మహమ్మారి నుంచి భారత్ బలంగా కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీకాల అభివృద్ధిలో భారత్ చూపిస్తున్న చొరవ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని భూటాన్ ప్రధాని లోతే తెలిపారు. భూటాన్ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చిన మీకు కృతజ్ఞులై ఉంటామని ఆయన అన్నారు.
ప్రధాని మోడి మాట్లాడుతూ.. అంతరిక్షంలోకి భూటాన్ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో సిద్ధమైందని, ఆ పని చాలా వేగంగా జరుగుతోందని ప్రధాని మోడి అన్నారు. భూటాన్ శాటిలైట్ పరిశీలన కోసం ఆ దేశానికి చెందిన నలుగురు అంతరిక్ష ఇంజినీర్లు ఈ డిసెంబర్‌లో ఇస్రో కార్యాలయానికి వెళ్లనున్నట్లు మోడి తెలిపారు. ఆ నలుగురికీ కంగ్రాట్స్ చెబుతున్నట్లు ప్రధాని వెల్లడించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు