శ్రీకాంత్ కుమార్ కు అల్లు పురస్కారం...

- November 20, 2020 , by Maagulf
శ్రీకాంత్ కుమార్ కు  అల్లు పురస్కారం...

వంశీ గ్లోబల్ అవార్డ్స్ (ఇండియా), యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ (లండన్) వ్యాలీ వేదిక (అమెరికా),శారదా కళా సమితి (విజయవాడ) సంయుక్త ఆధ్వర్యంలో 22 నవంబర్ 2020 ఆదివారం సాయంత్రం 7 గంటలకు కు (భారత కాలమానం ప్రకారం) "పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య జీవిత చిత్రం - ఇది ముగింపు లేని కథ" అనే గ్రంధాన్ని రచించిన - ప్రముఖ జర్నలిస్టు శ్రీ శ్రీకాంత్ కుమార్ కు "పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య - వంశీ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం - 2020" బహూకరిస్తున్నట్లు వంశీ వ్యవస్థాపకులు, కళా బ్రహ్మ, శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, యునైటెడ్ కింగ్ డమ్  తెలుగు అసోసియేషన్  ట్రస్టీ డాక్టర్ వి పి కిల్లీ, Valley వేదిక అమెరికా వ్యవస్థాపకురాలు మరియు  కార్యక్రమ నిర్వాహకురాలు శారద కాశీ వఝల, శారదా కళా సమితి అధ్యక్షులు  డాక్టర్ డోగి పర్తి శంకర రావు తెలియజేశారు.. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, ప్రజా నటి, కళాభారతి, డాక్టర్ జమునా రమణా రావు,  పద్మశ్రీ పురస్కార గ్రహీత  డా. తుర్లపాటి కుటుంబరావు, డాక్టర్ జి సమరం, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు,  డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రోగ్రసెస్ తెలుగు అసోసియేషన్, నటరాజు ఇల్లూరి, సంతోషం పత్రిక సంపాదకులు సురేష్ కొండేటి, బిఎస్ఎన్ఎల్ పూర్వ DGM ఎమ్ ఆర్ ఎస్ ప్రసాదరావు, వంశీ అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, వంశీ  ఫౌండేషన్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి  పాల్గొంటారు.

అనూ సిస్టర్స్ అనురాధ, చింతలపాటి సురేష్, శరత్ బాబు, రాజా సినీ సంగీత విభావరి సమర్పించనున్నారు.ఈ కార్యక్రమాన్ని http://www.youtube.com/valleyvedika ద్వారా లైవ్ లో వీక్షించవచ్చు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com