మోడిఫై చేసిన 27 కార్లను సీజ్ చేసిన దుబాయ్ పోలీసులు

- November 21, 2020 , by Maagulf
మోడిఫై చేసిన 27 కార్లను సీజ్ చేసిన దుబాయ్ పోలీసులు

దుబాయ్:కార్లను ఇష్టానుసారంగా మోడిఫై చేసిన 27 కార్లను దుబాయ్ పోలీసులు సీజ్ చేశారు. కంపెనీ నుంచి వచ్చిన ఇంజిన్ ను...సరైన ప్రయాణాలు పాటించకుండా మోడీఫై చేయటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని పోలీసులు హెచ్చరించారు. సీఐడీ సాయంతో నిర్వహించిన డ్రైవ్ లో ఇంజిన్లను మోడిఫై చేసి కార్ స్పీడును పెంచినట్లు గుర్తించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఓ ప్రామాణికతకు లోబడి కంపెనీలు ఆయా కార్ల మోడళ్లకు తగ్గట్లుగా ఇంజిన్ను డిజైన్ చేస్తాయని, అవి ఎంత స్పీడుగా వెళ్లాలో శాస్త్రీయంగా నిర్ధారిస్తాయని వివరించారు. కానీ, కొందరు కంపెనీ ప్రమాణాలతో ఇంజిన్లను తమకు తోచినట్లు మార్చుకుంటున్నారని, డబుల్ బూస్టర్లు వేయించి 200 గరిష్ట వేగంతో వెళ్లగలిగేందుకు మాత్రమే అనువుగా ఉండే కార్ల వేగాన్ని 400 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకునేలా మార్చుకుంటున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రమాదకరమని శక్తిమించి స్పీడు సామర్ధ్యాన్ని పెంచుకోవటం ద్వారా కారును కంట్రోల్ చేయటం సాధ్యం కాదనే విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మోడీఫై కార్లతో ఒక్క డ్రైవర్ కారణంగా రోడ్డు మీద ఇతర వాహనదారులకు, పాదచారులకు ముప్పు ఏర్పడుతోందని...వీటిని సహించబోమన్నారు. ఎవరైనా కార్లను మోడీఫై చేసినట్లు గుర్తిస్తే Dh1,000 జరిమానాతో పాటు 12 బ్లాక్ పాయింట్లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే వాహనాన్ని 30 రోజుల పాటు సీజ్ చేస్తామన్నారు. తీవ్రతను బట్టి ఫైన్ పెరుగుతుందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com