సౌదీలో కోవిడ్ 19 ట్రేసింగ్ యాప్...ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు

- November 21, 2020 , by Maagulf
సౌదీలో కోవిడ్ 19 ట్రేసింగ్ యాప్...ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు

రియాద్:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సౌదీ ప్రభుత్వం..కరోనా సోకిన వారిని గుర్తించేందుకు, వారితో కాంట్రాక్ట్ లో ఉండేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోవిడ్ 19 కాంట్రాక్ట్-ట్రేసింగ్ యాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన మూడో దేశంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను సాంకేతిక సేవలతో అధిగమించటం అనివార్యమంటూ సౌదీ డేటా& ఏఐ(SDAIA) ప్రెసిడెంట్ డాక్టర్ అబ్ధుల్లా బిన్ షరీఫ్ అల్ గంమ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ శ్రేణి మొబైల్ కంపెనీల నుంచి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కింగ్డమ్ లోని అధునాతన సాంకేతిక పరిజ్నానం ఎప్పుడు ముందు వరుసలో ఉండటం గర్వించాల్సిన విషయమని ఆయన ప్రశంసించారు. ఈ నెల 20 నుంచి 22 వరకు సౌదీ వేదికగా నిర్వహించే జీ20 సదస్సు కోసం జరిగిన సన్నాహాక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్ధతపు అవకాశాలను సమర్ధవంతంగా అందరూ అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను అధిగమించటంతో పాటు భవిష్యత్తులోనూ సాంకేతికతకు ఆవశ్యతను ఎవరూ తోసిపుచ్చలేరని ఆయన అన్నారు. డిజిటల్ ఎకనామీ, టెక్నాలజీ ఇప్పుడైనా, ఎనాడైనా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com