హద్దు దాటిన కాంట్రాక్టర్లు, కంపెనీలకు కువైట్ షాక్..
- November 21, 2020
కువైట్ సిటీ:నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లకు, కంపెనీలకు కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. వివిధ పనులు, ప్రాజెక్టుల కోసం ఆయా కాంట్రాక్టర్లు, కంపెనీలు ప్రభుత్వం దగ్గర గ్యారెంటీగా పెట్టిన దాదాపు 90 మిలియన్ల కువైట్ దినార్లను పూర్తిగా స్వాధీనం చేసుకొని వాటిని ఎన్ క్యాష్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ కాంట్రాక్టర్లు, కంపెనీలకు తమ మంత్రిత్వ శాఖ నుంచి పేమెంట్లు వెళ్లాల్సి ఉంటే....గ్యారంటీలను ఎన్ క్యాష్ చేసుకునే బదులు ఆ బకాయిల చెల్లింపుల్లో కోత విధించనున్నట్లు పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రి స్పష్టం చేసింది. గత ఆర్ధిక సంవత్సరంలో పబ్లిక్ వర్క్స్ పరిధిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్లు, పలు ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టిన కంపెనీలు...తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవటంతో గతంలోనే పలు మార్లు నోటీసులు పంపించింది. లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఇప్పుడు ఆయా కాంట్రాక్టర్లు, కంపెనీలకు చెందిన 90 మిలియన్ల దినార్లను ఎన్ క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే..2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను రూపొందించే పనిలో ఉంది కువైట్ ప్రభుత్వం. కేవలం మినిస్ట్రి ఆధ్వర్యంలో చేపట్టే పలు ప్రాజెక్టులకు దాదాపు బిలియన్ దినార్లను కేటాయించేలా కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు