క్రీడల్లో మహిళా భాగస్వామ్యం 70 శాతం పెరుగుదల

- November 21, 2020 , by Maagulf
క్రీడల్లో మహిళా భాగస్వామ్యం 70 శాతం పెరుగుదల

రియాద్:సౌదీ అరేబియాలో మహిళలు క్రీడల్లో రాణిస్తున్నారనీ, ఇటీవలి కాలంలో వారి భాగం గణనీయంగా పెరిగిందనీ ప్రిన్స్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ టుర్కి చెప్పారు. సౌదీ అరేబియా, మహిళల్ని క్రీడా రంగంలో ప్రోత్సహిస్తోందనీ, ఈ కారణంగా వారి భాగస్వామ్యం 70 శాతం వరకు పెరిగిందని చెప్పారు ప్రిన్స్‌ అబ్దుల్‌ అజీజ్‌. మహిళల ఫుట్‌బాల్‌ లీగ్‌పై మాట్లాడిన ప్రిన్స్‌ అబ్దుల్‌ అజీజ్‌, ఈ పోటీల పట్ల చాలా ఉత్సాహంగా వున్నామని అన్నారు. ఈ విభాగంలో తాము ముందంజలో వున్నట్లు చెప్పారు. చిన్న మధ్య తరహా సంస్థలు స్పోర్ట్స్‌ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ దిశగా తాము ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఈ విభాగంలో మరిన్ని విజయాలు సాధిస్తామని అన్నారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com