మలేషియా లో నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుతో మృతి
- November 21, 2020
కౌలాలంపూర్:నిజామాబాదు జిల్లా గూపన్ పల్లి గ్రామానికి చెందిన బాల రవీందర్ ఇటీవల మలేషియా జోహార్బారు లోని సుల్తానా అమీనా హాస్పిటల్లో గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం మృతిని భార్య బాల లక్ష్మి మరియు వారి సంబంధికులు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) అధ్యక్షుడు తిరుపతికి తెలియజేసారు.ఈ విషయం తెలిసిన వెంటనే మైట మైగ్రేట్ వింగ్ ప్రెసిడెంట్ ప్రతీక్ వారి సభ్యులు మలేషియా లోని ఇండియన్ ఎంబసీ తో ఆసుపత్రి తో మరియు వారి బంధువులతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని ఈ రోజు 21/11/2020 రోజున వందే భరత్ మిషన్ ద్వారా స్పెషల్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ ఫ్లైట్ లో హైదరాబాద్ శంషాబాద్ ఏర్పోర్ట్ కు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట ) విన్నపం మేరకు ఈ మృత దేహాన్ని హైదరాబాద్ పంపడానికి ఆయన మొత్తం ఖర్చు మలేషియా లోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా భరించిందని మైట వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలియజేసారు. దీనికి సహకరించిన కోర్ కమిటీ మరియు మైట సబ్యులకు ఉపాధ్యక్షుడు సత్య కృతజ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









