దేశం విడిచి వెళ్ళేందుకు సిద్ధమైన 7,000 మంది వలసదారులు
- November 21, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం 7,689 మంది వలసదారులు, దేశం విడిచి వెళ్ళేందుకు సిద్ధంగా వున్నారని తెలుస్తోంది. ఎలాంటి జరీమానాలూ చెల్లించకుండా వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నవంబర్ 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, నమోదు చేసుకున్నవారిలో 3263 మంది వలసదారులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. 408 మందికి వర్క్ పర్మిట్లు లేవు. 253 మంది వర్క్ పర్మిట్స్ రద్దయ్యాయి. కాగా, 3,765 మంది వర్క్ పర్మిట్లు యాక్టివ్‌గా వున్నప్పటికీ వారు దేశం విడిచి వెళ్ళాలనుకుంటున్నారు. కాగా, 93 మందికి ఫ్యామిలీ వీసాలు కూడా కలిగి వుండడం గమనార్హం. 87 ఫ్యామిలీ జాయినింగ్ వీసాలు, 147 విజిట్ వీసాలు, 12 టూరిస్ట్ వీసాలు, 7289 వర్క్ వీసాలు కలిగినవారు వుండగా, 61 మంది వద్ద డాక్యుమెంట్లు లేవు. డిసెంబర్ 31 వరకు ఈ స్కీం అందుబాటులో వుంటుంది. ఎంబసీలు, మినిస్ట్రీ వెబ్సైట్ అలాగే సనద్ సెంటర్లలో రిజిస్ట్రేషన్‌కి అవకాశం కల్పిస్తున్నారు. చెల్లుబాటయ్యే టిక్కెట్ అలాగే పిసిఆర్ టెస్ట్ తప్పనిసరిగా వుండాలి దేశం విడిచి వెళ్ళాలనుకునేవారికి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ